HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rbi Move Is Good News For Fd Investors Bad News For Loan Takers

Fixed Deposits : ఫిక్స్ డ్ డిపాజిటర్లకు గుడ్ న్యూస్ చెప్పి…రుణగ్రహీతలకు షాకిచ్చిన ఆర్బీఐ..!!

భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపోరేటును అరశాతం పెంచడం వల్ల రుణాలు తీసుకున్న మరింత భారం పడనుంది. ఇప్పటికే రుణాలుతీసుకున్నవారిపై EMIలు పెరిగేందుకు దారితీయనుంది.

  • Author : hashtagu Date : 08-06-2022 - 12:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rbi
Rbi

RBI…భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపోరేటును అరశాతం పెంచడం వల్ల రుణాలు తీసుకున్న మరింత భారం పడనుంది. ఇప్పటికే రుణాలుతీసుకున్నవారిపై EMIలు పెరిగేందుకు దారితీయనుంది. నెలరోజుల క్రితమే ఆర్బీఐ రెపోరేటును 0.40 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. అంటే నెల రోజుల్లోనే కీలక రేటును 0.90 శాతం పెంచింది. తాజాగా రెపోరేటు 4.90 శాతానికి చేరింది.

వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేయనున్న రేటునే రెపో రేటు అంటారు. ఈ రేటుకు బ్యాంకులు తమ మార్జిన్ , రిస్క్ కలుపుకుని రుణాలపై రేట్లు ప్రకటిస్తాయి. ఆర్బీఐ రెపోరేటును పెంచినప్పుడల్లా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై రేట్లు సవరిస్తాయి. దీంతో EMIపెరగడం లేదంటే రుణ కాలవ్యవధి పెరగడం జరుగుతుంది.

ఉదాహరణకు రూ. 30లక్షల గృహ రుణాన్ని 20ఏళ్ల కాలానికి 7శాతం వడ్డీరేటుపై తీసుకున్నట్లయితే…ఇప్పుడు పెంచిన తర్వాత ఈఎంఐ రూ. 1,648కి పెరుగుతుంది. అంటే అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ. 23, 259 నుంచి రూ. 24, 907కి చేరుతుంది. ఒకవేళ వెహికల్ లోన్ తీసుకున్నట్లయితే రూ. 8లక్షలను 7 ఏళ్ల కాలానికి 10శాతం రేటుపై తీసుకున్నట్లయితే…నెల రోజుల్లో 0.90శాతం పెరగడం వల్ల ఈఎంఐ రూ. 375 పెరుగుతుంది. అంతేకాదు 5 లక్షల పర్సనల్ లోన్ ఐదేళ్ల కాలానికి తీసుకుంటే వడ్డీ రేటు 14శాతం నుంచి 14.9శాతానికి పెరుగుతుంది. ఈఎంఐ రూ. 235మేర పెరగుతుంది.

ఇక ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7శాతం దిగువనకు తగ్గడంతో…ఇప్పటివరకు వృద్ధాప్యంలో డిపాజిట్లపైనే ఆధారపడిన వారిని నిరాశకు గురిచేసింది. తాజా పెంపు తర్వాత డిపాజిట్లపైనా ఒక శాతం వరకు అదనపు రాబడికి అవకాశం ఏర్పడినట్లయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fd investors
  • loan
  • rbi

Related News

Nirmala Sitharaman Gold price

బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nirmala Sitharaman  ప్రపంచంలోని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, పసిడి ధరల అనూహ్య పెరుగుదలకు ఇదే కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని అన్నారు. వాటిని ఆర్బీఐ ఎప్పటికప్

    Latest News

    • టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఇంట విషాదం!

    • Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

    • Surya – Puri : సూర్య తో పూరి మూవీ..? కథ మాములుగా ఉండదట !!

    • Velugumatla House Collapse : కూల్చివేతలపై రాజకీయ నాటకమా? – పొంగులేటి

    • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

    Trending News

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

      • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

      • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

      • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd