HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rashmika Shifting To New House

Rashmika: ఓ ఇంటిదవుతోన్న ‘రష్మిక మందన్నా’… త్వరలోనే డేట్ ఫిక్స్..!!

ఇప్పుడెక్కడ విన్నా యూత్ లో ఒకటే పేరు వినిపిస్తోంది. ఎవరి డీపీలను చూసినా... ఆమె ఫొటోనే దర్శనమిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు... మన ర‌ష్మిక మంద‌న్నా నే.

  • Author : Hashtag U Date : 04-02-2022 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
rashmika
rashmika

ఇప్పుడెక్కడ విన్నా యూత్ లో ఒకటే పేరు వినిపిస్తోంది. ఎవరి డీపీలను చూసినా… ఆమె ఫొటోనే దర్శనమిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు… మన ర‌ష్మిక మంద‌న్నా నే. నాగశౌర్య హీరోగా చేసిన `ఛ‌లో` సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టింది ఈ క‌న్న‌డ భామ. కెరీర్ తొలి నాళ్లలోనే వ‌రుస విజ‌యాల‌ను తన ఖాతాలో వేసుకుని, స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న ఈ వైట్ బ్యూటీ .. త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

రష్మిక మందన్నా గతేడాది ఫిబ్రవరిలోనే ముంబై నగరంలో సొంతంగా ఓ ఇం‍టిని కొనుగోలు చేసిన సంగ‌తి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇంటి గృహ‌ ప్ర‌వేశానికి సంబంధించిన ముహూర్తం ఖ‌రారైనట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మిక తన కొత్త సౌధానికి మారేందుకు అన్ని ఏర్పాట్లను చ‌క‌చ‌కా చేసుకుంటోంది. ఇక ఇదే విష‌యాన్ని ఆమె ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. సామాజిక మాధ్యమాలలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌ మందన్నా… తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌ లో `సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాను` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె త‌న కొత్తింట్లోకి అడుగుపెట్టబోతోందని… అదేనండీ… గృహ‌ప్ర‌వేశం చేయ‌బోతోంద‌ని.. అందుకే సామాన్లు స‌ద్దుకుంటోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే.. ఈ రకంగా రష్మిక ఓ ఇంటిది కాబోతోందన్న మాట.

ఇకపోతే, ముద్దుగుమ్మ ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవల `పుష్ప‌` వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అలరించింది. పుష్ఫ ఘనవిజయంతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో రష్మిక కు బాలీవుడ్ తో పాటు పలు భాషల్లోనూ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ అమ్మడు బ‌న్నీతో `పుష్ప- 2′, శ‌ర్వానంద్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన `మిషన్ మజ్ను`, అమితాబ్ బచ్చన్‌తో `గుడ్‌బై` సినిమాల్లోనూ న‌టిస్తోంది. పుష్ప మూవీలో శ్రీవల్లిగా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన రష్మిక మందన్నా చేతిలో మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mumbai
  • New house
  • Rashmika Mandanna

Related News

Iran Oil Tankers

ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు నౌకలను సీజ్!

Iran Oil Tankers  అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్‌తో సంబంధాలున్న ఈ నౌకలను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించారు. స్టెల్లార్ రూబీ,

  • Vijay Deverakonda- Rashmika

    ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd