Alia Bhatt:అలియా-రణబీర్ పెళ్లి అక్కడేనా..?
బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియాభట్, రణ్ బీర్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వీరి మ్యారేజ్ జరగనుంది. వీరి వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది
- By Hashtag U Published Date - 03:42 PM, Sun - 3 April 22
బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియాభట్, రణ్ బీర్ కపూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వీరి మ్యారేజ్ జరగనుంది. వీరి వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ కు బదులుగా ఇండియాలోనే పెళ్లాడనున్నారు. ఈ లవ్ బర్డ్స్ దంపతులుగా కొత్త ప్రయాణాన్ని ముంబైలో ప్రారంభించబోతున్నారు. కపూర్ ల పూర్వీకులకు ముంబై, చెంబూరులో అర్కే హౌస్ పేరుతో ఓ ఇల్లు ఉంది. వీరి వివాహానికి ఈ ఆర్కే హాస్ వేదిక కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేదికను రణ్ బీర్ కపూర్ సెలక్ట్ చేశాడట.
రణబీర్ తల్లిదండ్రులు రిషి కపూర్ , నీతూ కపూర్ ల పెళ్లి ఈ ఆర్కే హౌజ్ లోనే జరిగింది. దీంతో రణ్ బీర్ సెంటిమెంట్ గా భావించి ఇక్కడే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. పెళ్లి జరిగే తేదీని మాత్రం రహస్యంగా ఉంచారు. ఇక భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మస్త్రం లో అలియా, రణబీర్ తొలిసారి కలిసి యాక్ట్ చేశారు. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. కరణ్ జోహార్ ప్రొడ్యూసర్. ఈ ఏడాది సెప్టెంబర్ 9న బ్రహ్మస్త్ర రిలీజ్ కానుంది. గతేడాది చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రాజ్ కుమార్, పత్రలేఖ, మౌనీ రాయ్, సూరజ్ లు వివాహం చేసుకున్నారు.
Related News
Ranbir Kapoor : రణ్బీర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ తెలిస్తే షాక్ అవుతారు.. ఇండియాలోనే..!
రణ్బీర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ తెలిస్తే షాక్ అవుతారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే..