Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
ప్రగతి భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.
- Author : Balu J
Date : 12-08-2022 - 6:51 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రగతి భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు, రాష్ట్ర మంత్రి కె.టి.రామారావుకు రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కవిత తన సోదరుడికి రాఖీ కట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ కు ఆయన అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకలో శోభారావు, కేటీఆర్ భార్య శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. మంత్రి కేటీఆర్ గాయం నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
కాగా, అన్నదమ్ముల బంధానికి సంబంధించిన కొన్ని పాత ఫొటోలను కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి’’ అంటూ ట్వీట్ చేశాడు. కవితతో చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేశారు. తన కుమార్తె, కొడుకు రక్షా బంధన్ జరుపుకుంటున్న పాత ఫొటోలను షేర్ చేశాడు కేటీఆర్. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మహిళా నేతలు పలువురు రాష్ట్ర మంత్రులకు రాఖీలు కట్టి పండుగ జరుపుకున్నారు.
Some bonds are so special 😊#HappyRakhi #HappyRakshabandan pic.twitter.com/9WPibLeQMi
— KTR (@KTRBRS) August 12, 2022