Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పెంపు
Rajiv Yuva Vikasam Scheme : ఈ పథకం కింద యువతకు ఉద్యోగ అవకాశాలు, వృత్తి అభ్యాస శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది
- By Sudheer Published Date - 09:18 PM, Mon - 31 March 25

తెలంగాణ ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” పథకానికి (Rajiv Yuva Vikasam Scheme) దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. ఈ పథకం కింద యువతకు ఉద్యోగ అవకాశాలు, వృత్తి అభ్యాస శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండడంతో మరిన్ని యువతకు అవకాశం కల్పించేందుకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
LRS : ముగిసిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు
ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్), జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వేగంగా అమలు చేయడం, మరింత మంది యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించడం గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా యువత ఈ పథకాన్ని వినియోగించుకుని, తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఈ పథకం ద్వారా స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగావకాశాలు పెరగడం వల్ల యువత ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారతారని అధికారులు పేర్కొన్నారు. గడువు పొడిగించిన నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు.