Nayanthara & Vignesh: కల్యాణం కమనీయం.. ఒక్కటైన నయన్-విఘ్నేష్!
ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న నయన్, విఘ్నేష్ జంట అథితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
- By Balu J Updated On - 03:20 PM, Thu - 9 June 22

ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న నయన్, విఘ్నేష్ జంట అథితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇవాళ గురువారం ఉదయం తమిళనాడులోని మహాబలిపురంలోని షెరటన్ పార్క్‌లో పెళ్లి సందడి మొదలైంది. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన వివాహ వేడుక కార్యక్రమం రెండు గంటల పాటు సాగింది. కొంతమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్ సహా పలువురు అగ్ర తారలు కూడా వివాహా వేడుకకు అటెండ్ అయ్యారు.
ఈ జంట తమిళ పరిశ్రమలోని కొంతమంది పెద్దలను ఆహ్వానించింది. తమ పెళ్లిరోజు సందర్భంగా విఘ్నేష్ సోషల్ మీడియాలో ఓ ఎమోషన్ పోస్ట్ పెట్టాడు. ‘‘ఈ రోజు నయన్ డే అని ఆయన చెప్పాడు. మంచి వ్యక్తులు, మంచి సమయాలు, అనుకోని మధురమైన ఘటనలు, అందరి ఆశీస్సులు, దేవుడి ప్రార్థనలు, షూటింగ్ రోజులు… తన జీవితం ఇంత ఆనందంగా ఉండేందుకు ఇదే కారణమని తెలిపాడు. ఈ ఆనందమైన జీవితాన్ని ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ నయన్ కు అంకితం చేస్తున్నానని చెప్పాడు. పెళ్లికూతురుగా ముస్తాబై, వేదికపైకి వస్తున్న నయన్ ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా’’ అంటూ ఎమోషన్ అయ్యాడు.
2015లో నానుమ్ రౌడీ ధాన్ కథనం సందర్భంగా నయనతారను విఘ్నేష్ శివన్ కలిశాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుడిగాలి రొమాన్స్ తర్వాత, నయనతార మరియు విఘ్నేష్ శివన్ ఈరోజు జూన్ 9న ప్రియమైన వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కోసం భారీ గాజుల మండపం ఏర్పాటైంది. కఠిన ఆంక్షలు, భారీ బందోబస్తు మధ్య ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
Related News

Music Maestro Ilayaraja: సంగీత సామ్రాజ్యాధిపతికి వందనం
ఇళయరాజా...సంగీత ప్రియులకే కాదు సగటు తెలుగు సినిమా చూసే ప్రేక్షకునికి పరిచయం అవసరం లేని పేరు.