Election Effect: రూ.200 కోట్ల విలువైన డబ్బు, మద్యం, బంగారం సీజ్
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నాయి. ఈ మేరకు డబ్బు, మద్యాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 28-10-2023 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
Election Effect: దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నాయి. ఈ మేరకు డబ్బు, మద్యాన్ని యథేచ్ఛగా పంపిణి చేస్తున్నారు. మరోవైపు బంగారు ఆభరణాలతో ఓటర్లకు వల వేస్తున్న పరిస్థితి. రాజస్థాన్ లో అక్టోబర్ 9 నుండి మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు, మద్యం వెలుగు చూసింది. నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు మరియు ఆభరణాలతో సహా రూ. 200 కోట్ల విలువైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.
12 మంది అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వికాస్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా నిఘా ఉంచేందుకు ‘స్టార్మ్ క్లబ్’ (STORM CLUB)ని ఏర్పాటు చేశారు. దీని అర్ధం ఏంటంటే. సూపర్‌విజన్, ట్రాకింగ్, ఆపరేషన్, రికార్డ్ కీపింగ్, మానిటరింగ్, కంట్రోల్ అండ్ కమాండ్, లైజన్ మరియు యూనిఫైడ్ బేస్. ఇందులో భాగంగా రూ. 25 కోట్ల నగదు, రూ. 20 కోట్ల విలువైన మద్యం మరియు రూ. 20 కోట్ల విలువైన ఆభరణాలు మరియు బంగారం సీజ్ చేశారు. దీంతో పాటు వివిధ జిల్లాల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రూ.60 కోట్ల విలువైన డ్రగ్స్, పెట్రోల్, డీజిల్, అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ప్రత్యేక కోడ్ మరియు పర్యవేక్షణతో 650 చెక్‌పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి మరియు వార్ రూమ్‌లో నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల సమయంలో రూ.65 కోట్లు సీజ్ అయ్యాయి.
Also Read: Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. 47 పరుగులు చేస్తే చాలు..!