Rajasingh: నవరాత్రి ఉత్సవాలపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
దసరా పండుగ సమీపిస్తుండటంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి.
- By Balu J Published Date - 04:50 PM, Sat - 14 October 23

Rajasingh: దసరా పండుగ సమీపిస్తుండటంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో దాండియా కార్యక్రమాల ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమం హిందువులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని.. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.
ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో దాండియా కార్యక్రమంలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని.. ఇతర మతానికి చెందిన వ్యక్తులు లవ్ జిహాద్ పేరుతో అసభ్య కార్యక్రమలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో దాండియా ఏర్పాటు చేసే నిర్వాహకులు లోపలికి అనుమతించే ముందు తప్పకుండా ఆధార్ కార్డు అందరిదీ పరిశీలించాలని.. ఇతర మతానికి చెందిన ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దని ఆయన హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.