Raja Singh: జోగులాంబ ఆలయంలో దర్గానా ? తొలగించాల్సిందే .. ఏఎస్ఐకి రాజాసింగ్ లేఖ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రఖ్యాత జోగులాంబ ఆలయం ప్రాంగణంలో అక్రమంగా దర్గా నిర్మించారని ఆరోపించారు.
- By Hashtag U Published Date - 09:45 PM, Mon - 23 May 22

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రఖ్యాత జోగులాంబ ఆలయం ప్రాంగణంలో అక్రమంగా దర్గా నిర్మించారని ఆరోపించారు. ఈమేరకు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంస్థకు సోమవారం లేఖ రాశారు. ఆలయం ప్రాంగణంలో హిందూయేతర మత నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
హిందువులు ఎంతో విశ్వసించే శక్తి పీఠం ఉన్నచోట ఇలాంటి నిర్మాణం ఉండటం సరికాదని ఆక్షేపించారు. కొన్నేళ్ల క్రితం జోగులాంబ ఆలయం ప్రాంగణంలో ఈ అక్రమ నిర్మాణం జరిగినా .. నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పారు. నాటి ప్రభుత్వ వైఫల్యం వల్లే అది ఇంకా తొలగించబడలేదని పేర్కొన్నారు. వెంటనే ఆ దర్గాను ఆలయ ప్రాంగణం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.