Kothagudem: వరదలో నీటిలో స్మశాన వాటికి.. రోడ్డుపై దహన సంస్కారాలు
స్మశాన వాటికలో వరద నీరు చేరడంతో 90 ఏళ్ళ వృద్ధురాలిని రోడ్డుపై దహనం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది
- By Praveen Aluthuru Published Date - 12:20 PM, Mon - 31 July 23
Kothagudem: స్మశాన వాటికలో వరద నీరు చేరడంతో 90 ఏళ్ళ వృద్ధురాలిని రోడ్డుపై దహనం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఒడ్డున ఉన్న పలు గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరింది. వర్షాల కారణంగా కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో ఎక్కువగా నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికలు వరదనీటిలో మునిగిపోయాయి. ఇదిలా ఉంటే బూర్గంపాడు మండలంలో వృద్ధురాలు ముదిగొండ తిరుపతమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. దీంతో స్మశాన వాటికకు తీసుకెళ్లగా, వరద నీటిలో స్మశాన వాటిక మునిగిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు మృతురాలిని రోడ్డుపైనే దహనం చేశారు.
Also Read: వైట్ టాప్ మరియు గాగుల్స్ తో కావ్య థాపర్ ట్రెండింగ్