Cyberabad: అక్రమ బెల్ట్ షాపులపై రైడ్.. 197 లీటర్ల మద్యం స్వాధీనం
- By Balu J Published Date - 03:55 PM, Thu - 21 March 24
Cyberabad: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై సైబరాబాద్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు. మొత్తం ఎనిమిది పోలీస్టేషన్లు పరిధుల్లో సోదాలు చేసిన పోలీసులు… 7.47లక్షల విలువ చేసే 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 480 లీటర్ల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
దీంతో పాటు మోకిలా, రాజేంద్రనగర్, శామీర్ పేట్, బాచుపల్లి, మైలార్ దేవ్ పల్లి, నందిగామ, దుండిగల్ ఠాణాల పరిధుల్లో ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ఎక్సైజ్ ఠాణాలకు అప్పగించారు. రెండు రోజుల క్రితం కూడా మొత్తం 7ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు…197లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన దగ్గర్నుంచీ తనిఖీలు ముమ్మరం చేశారు. బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు
Related News
Pithapuram: పవన్ ని ఓడించేందుకు కుట్ర..పిఠాపురంలో 80 లక్షల మద్యం సీసాలు..
పిఠాపురంలోని వైఎస్ఆర్ గార్డెన్ ప్రాంతంలో కుమారపురంలో రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలు వెలుగు చూశాయి. దీంతో అక్కడ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒకే ఇంట్లో 2560 లీటర్లకు పైగా మద్యం నిల్వ ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.