Raghu Rama Krishna Raju: మాజీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ దేశం వదిలి వెళ్లకుండా చర్యలు చెప్పట్టాలి…
తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
- Author : Kode Mohan Sai
Date : 28-11-2024 - 2:38 IST
Published By : Hashtagu Telugu Desk
Raghu Rama Krishna Raju: తనపై జరిగిన కస్టడీ హింస కేసులో సుప్రీంకోర్టు విచారణపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఐడీ విచారణ పారదర్శకంగా సాగుతోందని పేర్కొన్నారు. తనపై దాడి చేసిన అధికారులు అరెస్టయ్యారని, త్వరలో మరికొందరు కూడా అరెస్టవుతారని తెలిపారు.
‘‘విజయ్‌పాల్ నన్ను అక్రమంగా అరెస్టు చేసి, దురుసుగా ప్రవర్తించారు. కోర్టులో వాస్తవాలు బయటపడుతున్నాయి. అప్పటి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ తన ప్రైవేట్ సిబ్బందితో నాపై దాడి చేశారు. త్వరలో ఆ వివరాలు కూడా బయటకొస్తాయి. సునీల్ కుమార్ రాష్ట్రం, దేశం విడిచిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి’’ అని రఘురామకృష్ణ రాజు చెప్పారు.