Radhe Shyam Collections: బాక్సాఫీస్ వద్ద ఫస్ట్‌డే.. కూల్‌గా కొల్లగొట్టిన రాధే శ్యామ్..!
- Author : HashtagU Desk
Date : 12-03-2022 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన అత్యంత ఖరీదైన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ మూవీస్ అండ్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏడు వేల స్క్రీన్‌లో గత శుక్రవారమే రిలీజ్ అయ్యింది. అయితే తొలి షో నుంచే రాధే శ్యామ్ పై మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అని అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫస్ట్‌డే రాధే శ్యామ్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు కుమ్మేశాడని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో మొదటి రోజు 79 కోట్ల గ్రాస్‌ని అందుకుందని, ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కరోనా పాండమిక్ తర్వాత ఇంత భారీగా కలెక్ట్ చేసింది రాధే శ్యామ్ సినిమా మాత్రమే అని చెప్పాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 30 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే జాంలో రికార్డు స్థాయిలో 15.50 కోట్లు వసూలైనట్లు సమాచారం. దీంతో వీకెండ్‌లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆశక్తిగా మారింది.
#RadheShyam ruling the Boxoffice🎞️🎟️, thankyou for making the Highest Grosser film Post Pandemic with 79cr!#BlockBusterRadheShyam ❤
Book your tickets now on @paytmtickets!https://t.co/Dr28SLfkza#Prabhas @hegdepooja @director_radhaa pic.twitter.com/nVcpOfGURi
— UV Creations (@UV_Creations) March 12, 2022