HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >R Criticizes Revanth Reddy Brs State Conference

KTR : సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డం..

KTR : తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పోరాటమనేది బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏమీ కదన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, ఈ చిట్టి నాయుడు మ‌న‌కు ఓ లెక్క కాదని ఫైర్ అయ్యారు.

  • Author : Kavya Krishna Date : 17-10-2024 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Brsv
Ktr Brsv

KTR : తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సులో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. “ఉడుత ఊపుల‌కు భ‌యపడ‌డం.. గుంపు మేస్త్రీ అంటే క‌ట్టెటోడు.. కానీ ఇతను కూల్చేటోడు,” అని కేటీఆర్ ఆరోపించారు. పోరాటం అంటే బీఆర్ఎస్‌కు కొత్త ఏమి కాదని, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులతో కొట్లాడిన వారి గురించి ప్రస్తావించారు. “ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు,” అని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ హక్కుల వాదనలో ఉన్న ఇతర వర్గాలకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. “జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అశోక్ నగర్ పోతే చుట్టూ పోలీసులు ఉన్నారు,” అని తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ భవన్‌కు వచ్చి, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.

Study : ప్రతి 10 మంది భారతీయుల్లో ఏడుగురు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు

“రేవంత్ రెడ్డి ఢిల్లికి 25 సార్లు వెళ్లిన వ్యక్తి,” అని కేటీఆర్ చెప్పారు. “తులం బంగారం గురించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే, రాష్ట్రంలో మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం జరుగుతున్నప్పుడు బీజేపీ మౌనంగా ఉంటుంది,” అని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రంలో మరింత ప్రమాదకరమైన పార్టీగా పేర్కొన్న కేటీఆర్, “రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడాలి. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వీ సదస్సులు నిర్వహించాలి,” అని సూచించారు. “నా కంటే మంచి మాట్లాడే నాయకులు బీఆర్ఎస్‌లో ఉన్నారు,” అని తెలిపారు.

ఈ సందర్భంగా, రాష్ట్రంలోని ప్రతి కాలేజీలో బీఆర్ఎస్వీ జెండా, బ్యానర్ ఉండాలని, విద్యార్థులు పోరాటం చేయాలని కేటీఆర్ కోరారు. “మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుస్తున్నామని నమ్మడం మమ్మల్ని కొంప ముంచింది,” అని ఆయన చెప్పారు. “చిన్న చిన్న పొరపాట్లు చేశాం, వాటిని సవరించుకుందాం, ప్రజలకు దగ్గర అవుదాం,” అని ఆయన సూచించారు. “విద్యార్థి నాయకులదే భవిష్యత్, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ దో కాదు, మన అందరిదీ,” అని కేటీఆర్ పిలుపునిచ్చారు. “ఇంకో 50 నుంచి 75 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది,” అని ఆయన పేర్కొన్నారు.

Dharmana Prasada Rao : ధర్మాన మౌనం వెనుక ఉన్న సంగతేంటి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Criticism
  • elections
  • ktr
  • Leadership
  • party strategy
  • politics
  • revanth reddy
  • state conference
  • student activism
  • telangana
  • telangana bhavan

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

  • Ktr Cbn

    CBN : “చరిత్రలో బాబు గొప్ప సీఎం ” – కేటీఆర్ సంచలన వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Latest News

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd