Fraud: పంది పిల్లల వ్యాపారం అంటూ వందల కోట్లకు టోకరా.. ఏం జరిగిందంటే?
సైబర్ నేరగాళ్లు కేటుగాళ్లు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకొని మోసం
- Author : Anshu
Date : 21-11-2022 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
సైబర్ నేరగాళ్లు కేటుగాళ్లు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకొని మోసం చేద్దామా అని ఎదురు చూస్తుంటారు. అమాయకమైన ప్రజలను మోసం చేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కేటుగాడు పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి అంటూ వందల కోట్లకు కుచ్చు టోపీ పెట్టాడు. పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఏడు నెలల్లోనే 1.5 రెట్ల డబ్బును పొందడం అంటూ ప్రజలను నమ్మబలికి వారిని దారుణంగా మోసం చేశాడు.
ఇదే వ్యవహారంపై పలు రాష్ట్రాలలో గతం మూడేళ్లుగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కాగా పంజాబ్ లోని ఫిరోజ్ నగర్ కు చెందిన మంగత్ రాం మైని ఒక వ్యక్తి అధిక రాబడుల పేరుతో భారీ మొత్తాలను వసూలు చేసి ప్రజలను మోసగించాడు. పదివేలు విలువైన మూడు పంది పిల్లలను కొనుగోలు చేసి పెంచితే విదేశాల్లో వాటిని మాంసానికి ఉన్న గిరాకీల వల్ల ఏడు నెలల లోపే 40000 వస్తాయి అంటూ ప్రజలను నమ్మబలిగాడు. నెలలు కాగానే 15000 ఇస్తానని మిగిలిన 25000 వారానికి 500 చొప్పున 30 వారాలపాటు చెల్లిస్తాను అంటూ ప్రజలను నమ్మబలికాడు.
ఆకర్షితులైన పలువురు అతని మాయ మాటలు నమ్మి పదివేల నుంచి రెండు కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. రక్షణ రంగా ఉద్యోగి 25 లక్షలు సమర్పించారు. ఇలా అందర్నీ మోసం చేసి దాదాపు 500 కోట్లు వసూలు చేసి కొన్ని వారాలపాటు డబ్బులు బాగానే చెల్లించి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించేసాడు అని బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ తో పాటు పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం గమనార్హం.