Terrorist Spies : పంజాబ్‌లో ఉగ్ర గూఢచారుల ముఠా అరెస్ట్.. పాక్ ఐఎస్ఐతో అనుబంధాలు
Terrorist Spies : పంజాబ్‌లో జాతీయ భద్రతకు పెనుముప్పుగా మారేలా కుట్రలు నడుస్తున్నాయి. సింధూర్ ఆపరేషన్ సమయంలో భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తూ గగన్‌దీప్ సింగ్ అనే యువకుడిని తర్ణ్‌తారన్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మంగళవారం ప్రకటించారు.
- By Kavya Krishna Published Date - 11:15 AM, Tue - 3 June 25

Terrorist Spies : పంజాబ్‌లో జాతీయ భద్రతకు పెనుముప్పుగా మారేలా కుట్రలు నడుస్తున్నాయి. సింధూర్ ఆపరేషన్ సమయంలో భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తూ గగన్‌దీప్ సింగ్ అనే యువకుడిని తర్ణ్‌తారన్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మంగళవారం ప్రకటించారు. డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, గగన్‌దీప్ సింగ్ గత ఐదు సంవత్సరాలుగా పాక్ ఖలిస్తానీ మద్దతుదారుడు గోపాల్ సింగ్ చావ్లా ద్వారా పాక్ ఇంటలిజెన్స్ వర్గాలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఈ పరిచయాల ద్వారానే అతడు ఐఎస్‌ఐ ఏజెంట్లతో కాంటాక్ట్‌లోకి వెళ్లాడు.
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడ?
తొలిక దర్యాప్తులో గగన్‌దీప్ సింగ్ భారత సైన్యం దళాల కదలికలు, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారాన్ని పాక్‌కు పంపించినట్టు తేలింది. ఇతడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో 20 కంటే ఎక్కువ ఐఎస్‌ఐ కాంటాక్ట్‌ల వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్‌లో ఉన్న చానళ్ల ద్వారా అతడికి డబ్బు పంపినట్లూ డీజీపీ తెలిపారు. ఈ కేసును తర్ణ్‌తారన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అధికార రహస్యాల చట్టం (Official Secrets Act) కింద నమోదు చేశారు. అతడి ఆర్థిక లావాదేవీలు, టెక్నికల్ వెరిఫికేషన్‌ల ద్వారా నెట్‌వర్క్‌ను మొత్తం బహిర్గతం చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇంతలో మరో గూఢచార కార్యకలాపాల కేసులో మాలర్‌కోట్లకు చెందిన గజాలా అనే మహిళ, యామిన్ మొహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కి చెందిన అధికారికి సమాచారం లీక్ చేసినట్టు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి రోజుల్లో అమృత్‌సర్ (రూరల్) పోలీసులు ఫలక్‌షేర్ మసీహ్, సురజ్ మసీహ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు భారత సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్‌ల ఫోటోలను పాకిస్తాన్ ఇంటలిజెన్స్‌కి పంపినట్టు గుర్తించారు.
అరెస్ట్ అయిన గజాలా విచారణలో భాగంగా తన పనికి బదులుగా రూ. 30,000 రెండు విడతలుగా (రూ. 10,000 + రూ. 20,000) యూపీఐ ద్వారా పంపినట్లు ఒప్పుకుంది. ఈ మొత్తం, సమాచారాన్ని చేరవేసిన మార్గాలు ఇంకా వివరణాత్మకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఘటనలన్నీ భారత్‌లో విదేశీ శత్రు ఏజెన్సీల కుట్రలు ఎలా నడుస్తున్నాయన్నదానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోలీసులు మాత్రం ఈ గూఢచార ముఠాల అంతంమొందిస్తామని స్పష్టం చేశారు.
Canara Bank : బ్యాంకులో 59 కిలోల బంగారం చోరీ