HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Punjab Chief Minister Bhagwant Mann Sacks A Minister For Corruption

Punjab CM: పంజాబ్ సీఎం సంచలనం.. హెల్త్ మినిస్టర్ ఔట్!

ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పంజాబ్ సీఎం వేటు వేశారు.

  • By Balu J Published Date - 03:29 PM, Tue - 24 May 22
  • daily-hunt
Punjab
Punjab

దేశంలో అవినీతి అక్రమాలను రూపుమాపడమే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైంది. అలాంటి పార్టీలో  నేతలు అవినీతికి పాల్పడితే ఆప్ అధిష్టానం ఊరుకుంటుందా.. ? తగ్గేదేలే అంటూ వెంటనే వేటు వేసి దేశ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన కేబినెట్ లోని ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడం, అవన్నీ నిజమని స్పష్టంకావడంతో అతనిని మంత్రివర్గం నుంచి తొలగించారు. టెండర్లపై ఒక శాతం కమీషన్ Mr సింగ్లా డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలొచ్చాయి. దీంతో మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే.. పంజాబ్ పోలీసుల అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది.

10 రోజుల క్రితమే మంత్రిపై ఫిర్యాదు అందడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి తమ సొంత మంత్రివర్గ సహచరుడిపై ఇంత కఠిన చర్యలు తీసుకోవడం దేశ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2015లో అవినీతి ఆరోపణలపై తన మంత్రిలో ఒకరిని తొలగించారు.

సింగ్లా అవినీతిపై 10 రోజుల క్రితం ఓ ప్రభుత్వ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ‘‘మీకు అండగా ఉంటా. ఏ మంత్రులకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని ముఖ్యమంత్రి స్వయంగా అధికారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారి సహాయంతో ఆపరేషన్‌ చేయగా.. మంత్రి, ఆయన సన్నిహితులు ఒక శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు స్పష్టంగా వెల్లడైంది. కాల్ రికార్డింగ్‌లు, ఇతర సాక్ష్యాలను సేకరించిన తర్వాత  పంజాబ్ సీఎం మాన్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా అవినీతిని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

“ఒక శాతం అవినీతిని కూడా సహించబోం” అని మిస్టర్ మాన్ ఒక వీడియో సందేశంలో తెలిపారు. “ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ప్రభుత్వానికి ఓట్లు వేశారని, దానికి అనుగుణంగా మనం జీవించాలని, అరవింద్ కేజ్రీవాల్ లాంటివారు, భగవంత్ మాన్ లాంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతిపై మహా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది’’ అని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక నమూనాకు అనుగుణంగానే ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ పేర్కొంది. కేజ్రీవాల్ భగవంత్ మాన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. “భగవంత్ మీ గురించి గర్వపడుతున్నాను. నీ చర్య నా కన్నీళ్లను తెప్పించింది. ఈ రోజు మొత్తం దేశం ఆప్ పట్ల గర్వంగా ఉంది” అని ఆయన ట్వీట్ చేశారు.

Proud of you Bhagwant. Ur action has brought tears to my eyes.

Whole nation today feels proud of AAP https://t.co/glg6LxXqgs

— Arvind Kejriwal (@ArvindKejriwal) May 24, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP in Punjab
  • arrested
  • Health Minister
  • punjab cm

Related News

    Latest News

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd