India: లక్ష్వాదీప్ లో నిరసనలు
- Author : hashtagu
Date : 22-12-2021 - 4:17 IST
Published By : Hashtagu Telugu Desk
లక్ష్వాదీప్ లో నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ఉన్న సెలవు దినాన్ని ఆదివారంగా ప్రకటించడంతో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. లక్ష్వాదీప్ దివిలో 96% ముస్లిములు నివసిస్తారు. వారికీ శుక్రవారం నాడు నమాజ్ తప్పని సరి కాబట్టి అక్కడ శుక్రవారం రోజును సెలవుదినంగా కొన్ని దశాబ్దాలనుండి పాటిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతగా ఉన్న లక్ష్వాదీప్ కు ప్రఫుల్ ఖోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు. అక్కడి ముస్లిం వ్యతిరేక నిబంధనలు, చట్టాలు తెస్తున్నారని ఆయన పై విమర్శలు గతంలో కూడా వచ్చాయి.