BC: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ధర్నా
- By Balu J Published Date - 09:37 PM, Fri - 14 June 24

BC: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీ కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం 11 గంటలకు ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి. రాజారాం యాదవ్ అన్నారు.
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్, కవి, రచయిత సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఎంబీసీ వ్యవస్థాపకుడు, బీసీ టైమ్స్ సంపాదకులు సంగెం సూర్యారావు, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ తదితరులు హాజరు కానున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసేందుకు కసరత్తులు చేసినప్పటికీ ఎన్నికల కారణంగా సాధ్యపడలేదు. అందుకే స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.