HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ppf Scheme Makes Crorepati With Savings

పీపీఎఫ్ అంటే ఏమిటో తెలుసా.. రిటైర్ అయ్యేసరికి కోటిశ్వరులు అవ్వడం ఖాయం!

  • Author : Anshu Date : 21-06-2022 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Investment Tips
Investment Tips

ప్రస్తుత కాలంలో మధ్యతరగతి కుటుంబాలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు ఎలా ఆదా చేయడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి స్కీములను ఎంచుకుని డబ్బులు పొదుపు చేయాలి అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ఒక స్కీమ్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి వాటిలో కొన్ని స్కీమ్ లలో డబ్బులను ఆదా చేస్తే రిటైరయ్యేనాటికి కోటీశ్వరుల్ని కూడా చేస్తాయి. అయితే అలాంటి కొన్ని స్కీములు ఉన్నాయన్నది చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఒకటి. దీన్నే సంక్షిప్తంగా పీపీఎఫ్ అంటారు. ఈ సేవింగ్స్ స్కీమ్ ను భారత కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది కాబట్టి పొదుపు చేసే డబ్బుపై నిశ్చింతగా ఉండొచ్చు.

అలాగే పైగా పన్నుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ పథకంలో ఏడాదికి కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు పొదుపు చేయవచ్చు. దేశంలో అత్యధిక వడ్డీ అందించే పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. ఈ స్కీములో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా లభించే వడ్డీల కంటే ఇది చాలా ఎక్కువ. పీపీఎఫ్ లావాదేవీలకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఖాతాదారుడు 15 ఏళ్ల పాటు పీపీఎఫ్ లో పొదుపు చేసిన పిదప, తాను దాచుకున్న మొత్తాన్ని కోరుకోకుంటే, ఐదేళ్ల చొప్పున కాల పరిమితిని పెంచుకుంటూ పోవచ్చు.

పీపీఎఫ్ లో రోజుకు రూ.417 పొదుపు చేస్తే అది నెలకు రూ.12,500 వరకు… సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు చేరుకుంటుంది. స్కీమ్ కాలపరిమితి 15 ఏళ్లు పూర్తయ్యేసరికి ఆ మొత్తం రూ.40.58 లక్షలు అవుతుంది. ఆపై ఐదేళ్ల చొప్పున రెండు పర్యాయాలు స్కీమ్ ను పొడిగిస్తే మొత్తం 25 ఏళ్ల తర్వాత మీరు దాచుకున్న మొత్తం పరిపక్వమై రూ.1.03 కోట్లకు చేరుకుంటుంది. ఈ డబ్బుపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. కాగా పాతికేళ్ల పాటు పీపీఎఫ్ లో పొదుపు చేయడం ద్వారా ఒక్క వడ్డీ రూపంలోనే రూ.66 లక్షలు లభిస్తాయి. ఓ వ్యక్తి పాతికేళ్లలో ఈ పథకం కోసం చెల్లించేది రూ.37 లక్షలే. వడ్డీతో కూడా కలుపుకుంటే 35 ఏళ్ల వయసులో పీపీఎఫ్ సేవింగ్స్ ప్రారంభిస్తే 60 ఏళ్లకు మీరు కోటీశ్వరులు అవుతారు. పోస్టాఫీసుల ద్వారానూ ఈ పీపీఎఫ్ స్కీములో చేరవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crorepati
  • india
  • PPF
  • Savings Scheme

Related News

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd