Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు.. హోమో సెక్సువాలిటీ నేరం కాదు!
క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోమో సెక్సువాలిటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి.
- Author : Balu J
Date : 25-01-2023 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
Pope Francis: స్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోమో సెక్సువాలిటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. హోమోసెక్సువాలిటీ నేరం కాదన్నారు. తన పిల్లలు ఎలా ఉన్నా దేవుడు ప్రేమిస్తాడని చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను, అలాంటి వారిపట్ల వివక్షను ప్రదర్శించే చట్టాలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోనే కేథలిక్ బిషప్‌లు సమర్థిస్తున్నారని ఆయన గుర్తుచేశారు అదరి గౌరవాలన్ని బిషప్‌లు గౌరవించాల్సి ఉంటుందన్నారు.
దేవుడికి అందరిపై సమానమైన ప్రేమ, దయ, కరుణ ఉంటాయని చెప్పారు. బిషప్‌లు కూడా అదేవిధంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. హోమో సెక్సువాలిటీ విషయంలో నేరం వేరు, పాపం వేరని ఈ తేడాను ప్రతి ఒక్కరూ తెలుసుకుందామని చెప్పారు.