PM Viral: భక్తులతో కలిసి మోడీ భజనలు!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యవహరశైలితో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
- By Balu J Published Date - 12:24 PM, Wed - 16 February 22

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యవహరశైలితో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా అధికారిక కార్యక్రమానికి హాజరైతే, అక్కడి ప్రజలను ఆకట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ ఇక్రిసాట్ వేడుకలకు హాజరైన ప్రధాని, అక్కడ పండిస్తున్న వేరుశనగ పల్లీలను టెస్ట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా ఆయన ప్రముఖ కవి సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌ను సందర్శించారు. అక్కడ రవిదాస్ విగ్రహాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మందిర్‌లోని భక్తులతో కొంతసేపు మాట్లాడిన ప్రధాని.. వారితో కలిసి భజన కీర్తనల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కీర్తనలు ఆలపించారు.
Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg
— Narendra Modi (@narendramodi) February 16, 2022