PM Modi Egypt Tour : ఈజిప్ట్ చేరుకున్న ప్రధాని మోదీ.. అల్-హకీమ్ మసీదును సందర్శించనున్న ప్రధాని.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా ఆదివారం 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును సందర్శించనున్నారు.
- By News Desk Published Date - 07:48 PM, Sat - 24 June 23

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈజిప్టు (Egypt )చేరుకున్నారు. శనివారం అమెరి (America) కా పర్యటన ముగించుకొని నేరుగా ఈజిప్టు వెళ్లారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదేశంలోని కైరో చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్ బౌలీ సాదరంగా స్వాగతం పలికారు. 26ఏళ్లలో భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. ఈజిప్టు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడుడితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరుపనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును సందర్శించనున్నారు. కైరోలోని 16వ ఫాతిమిద్ ఖలీఫా అయిన అల్ – హకీమ్ బి-అమ్ర్ అల్లా (985 – 1021) పేరుమీద ఉన్న చారిత్రాత్మకమైన, ప్రముఖ మసీదు అయిన అల్ -హకీమ్ మసీదులో ప్రధాని దాదాపు అరగంటపాటు గడపనున్నారు. అల్-హకీమ్-బి- అమ్ర్ అల్లా యొక్క మసీదు కైరోలోని దావూదీ బోహ్రా కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశం.
ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఈ కమ్యూనిటీతో సుదీర్ఘ అనుబంధాన్ని కలిగిఉన్నాడు. పలు సార్లు వారితో తన అనుబంధాన్ని ప్రధాని మోదీ వివరించారు. అదేవిధంగా తన ఈజిప్ట్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశాన వాటికను కూడా సందర్శించనున్నారు.
#WATCH | PM Narendra Modi received by the Egyptian PM on his arrival at Cairo pic.twitter.com/uBe7lIYIau
— ANI (@ANI) June 24, 2023
Guinness World Records : 60 సెకన్లలో 10 విన్యాసాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆవు..