PM Modi mother passes away: ప్రధాని మోదీకి మాతృవియోగం
ప్రధాని మోదీ తల్లి (PM Modi mother) హీరాబెన్( Heeraben) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అనారోగ్య సమస్యతో ఆమె రెండు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
- Author : Gopichand
Date : 30-12-2022 - 6:56 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాని మోదీ తల్లి (PM Modi mother) హీరాబెన్( Heeraben) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అనారోగ్య సమస్యతో ఆమె రెండు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనతో ప్రధాని విషాదంలో మునిగిపోయారు. కొన్ని రోజుల క్రితమే ఆమె వందో పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూయడంతో ఆయన విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘‘వందేళ్లు పూర్తి చేసుకొని ఈశ్వరుడి చెంతకు చేరిన నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఇంత కాలం విలువలతో కూడిన జీవితాన్ని గడిపావు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ 1922లో గుజరాత్‌లోని మెహ్‌సనాలో జన్మించారు. 1935లో దామోదర్ దాస్ ముల్‌చంద్ మోదీతో వివాహం జరిగింది. ఆమెకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక ప్రతి తల్లిలాగే ఆమె కూడా సాధారణ మహిళలాగే జీవించేది. మోదీ ఇన్నేళ్ల ప్రజా జీవితంలో కేవలం రెండే రెండు సార్లు మాత్రమే రాజకీయ బహిరంగ సభల్లో కనిపించారు.