Modi : మండీలో మోడీ పర్యటన.. జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభం
- By Balu J Published Date - 03:58 PM, Mon - 27 December 21
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి తొలుత పలు స్టాళ్లను సందర్శించారు. స్థానిక కూరగాయల ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. డ్రోన్‌ల స్టాల్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండీ పర్యటనలో భాగంగా సుమారు 11 వేల కోట్ల రూపాయల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.