Order Of The Nile : ప్రధాని మోడీకి ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ .. ఈజిప్టు అత్యున్నత పురస్కారం ప్రదానం
Order Of The Nile : ఈజిప్టులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది..
- Author : Pasha
Date : 25-06-2023 - 2:52 IST
Published By : Hashtagu Telugu Desk
Order Of The Nile : ఈజిప్టులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది..
ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ ను మోడీకి ప్రదానం చేశారు..
‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ పురస్కారంతో ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసి సత్కరించారు.
కైరోలో మోడీ, అబ్దెల్ ఫత్తా ద్వైపాక్షిక సమావేశానికి ముందు ఈ ప్రదానోత్సవం జరిగింది.
ఈ అవార్డును తనకు అందించినందుకు ప్రధాని మోడీ కృతఙ్ఞతలు తెలిపారు.
Also read : Message Pin Duration : వాట్సాప్ మెసేజ్ ఇక పిన్ చేసేయండి
ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డును ఈజిప్టు భాషలో కిలాదత్ ఎల్ నిల్ అని పిలుస్తారు.. ఈ అవార్డును ఈజిప్టు సుల్తాన్ హుస్సేన్ కమెల్ 1915లో స్థాపించారు. దేశానికి ఉపయోగకరమైన సేవ చేసిన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారు. తొలినాళ్లలో ఈ అవార్డును ఈజిప్టులో పనిచేస్తున్న బ్రిటిష్ అధికారులకు, విశిష్టమైన ఈజిప్షియన్ పౌరులకు ప్రదానం చేసేవారు. 1953లో ఈజిప్ట్ రిపబ్లిక్ అయిన తర్వాత ఆర్డర్ ఆఫ్ ది నైలు అనేది ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారంగా మారింది. ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు 2 రకాలు.. మొదటిదాన్ని కాలర్ అంటారు.. దీన్ని రిపబ్లిక్ ప్రెసిడెంట్ ధరిస్తారు. ఈ అవార్డును ఇతర దేశాధినేతలకు కూడా ఇవ్వొచ్చు. ఇక రెండో రకం ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డును గ్రాండ్ కార్డన్ అంటారు. ఇది ఈజిప్ట్ దేశానికి విశేష సేవలందించిన వారికి ఇస్తారు.
Also read : 1975 Emergency Explained : ఇందిరాగాంధీ..1975 ఎమర్జెన్సీ..5 కారణాలు