Kisan Yojana: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు విడుదల
పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళ వారం విడుదల చేయనున్నారు.
- By Hashtag U Published Date - 09:57 AM, Tue - 31 May 22

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళ వారం విడుదల చేయనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 10 కొట్లు మందికి పైగా రైతుల ఖాతాల్లొ ఒక్కొక్కరికి రెండువేల రూపాయల చొప్పున దాదాపురూ.21వేలకోట్ల నిధులు జమకానున్నాయి. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ కేవైసీ చేయించనేందుకు కేంద్రం మరింత గడువు పెంచింది.
ఆధార్ డేటాతొ పిఎం కిసాన్ లబ్దిదారులందరికి ఈకేవైసీ ధ్రువీకరణ చేపట్టడానికి తొలుత ఈ ఏడాది మార్చి 31గా గడువును కేంద్రం నిర్దేశించింది. తర్వాత ఈ గడువును మే31 వరకు పొడిగించింది అయినా దేశవ్యాప్తంగా 11.22కొట్లు మంది లబ్ధిదారుల్లొ 50 శాతం
లొపే ఈకేవైసి చేయించుకున్నారు దీంతో మిగిలిన వారి కొసం గడువును ఈ ఏడాది జూలై 31 వరకు ఈ గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.