MLC Elections : టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం
MLC Elections : ఏడో రౌండ్ ముగిసేసరికి 70వేల ఓట్ల భారీ ఆధిక్యం నమోదు కాగా, ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది
- By Sudheer Published Date - 01:13 PM, Tue - 4 March 25

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections ) టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ( Perabathula Rajasekharam ) ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవును భారీ మెజారిటీతో ఓడించారు. ఏడో రౌండ్ ముగిసేసరికి 70వేల ఓట్ల భారీ ఆధిక్యం నమోదు కాగా, ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. తుది ఫలితాలు వెలువడిన తర్వాత మెజార్టీలో స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ప్రాభల్యం
ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తమ బలాన్ని చాటుకున్నారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థుల విజయంతో పార్టీ క్యాడర్ మరింత ఉత్సాహంతో ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో టీడీపీకి ఉన్న పట్టు, పట్టభద్రుల మద్దతు మరోసారి స్పష్టమైంది. గత ఎన్నికల్లో పార్టీకి ఎదురైన కఠిన పరిస్థితుల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు, రాబోయే ఎన్నికలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాలు, ఆ పార్టీకి బలమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఉద్యోగులు, పట్టభద్రులు తిరిగి టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. ఇదే దోరణి కొనసాగితే, పార్టీకి రాబోయే ఎన్నికల్లో బలమైన మద్దతు లభించొచ్చని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Talliki Vandanam : త్వరలోనే తల్లికి వందనంపై గైడ్ లైన్స్ – నారా లోకేష్