DK Shivakumar: తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: డీకే శివకుమార్
తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని డీకే శివకుమార్ అన్నారు.
- By Balu J Published Date - 06:12 PM, Sat - 25 November 23

DK Shivakumar: తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ పార్టీ నేత డీకే శివకుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రచారానికి ముందే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో పర్యటించానని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త కేబినెట్ హామీల అమలుకు తక్షణమే అమలు చేస్తామని, ఆ పార్టీ హామీలు ఓటర్లను ప్రలోభపెట్టడం కాదని, సామాజిక మార్పు, ఆర్థిక మార్పు కోసమేనని అన్నారు.
‘‘ప్రభుత్వం జేబుదొంగలతో తెలంగాణ ప్రజలు చాలా కాలంగా అష్టకష్టాలు పడుతున్నారు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, నిత్యావసర సరుకులు కూడా కొనలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అందుకే కాంగ్రెస్ పార్టీ రావాలని నిర్ణయించారు’’ అని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు.
Also Read: Smoking: పొగ తాగడం వల్ల కలిగే నష్టాలివే