HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pawan Kalyan Stresses On Active Membership Drive

Jana Sena: సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి!

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

  • Author : Hashtag U Date : 17-02-2022 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాదాపు లక్షమందికి పైచిలుకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో గమనించాను. పార్టీ కోసం ఎంతో కష్టపడి.. అభిమానంతో పని చేసేవారు ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడటం నా దృష్టి వచ్చింది. అలాగే కొంతమంది జన సైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ప్రమాదానికి గురైనవారికి, మరణించిన వారి కుటుంబాలకు జనసేన నాయకులు వ్యక్తిగతంగా సహాయం అందించారు. ఇవన్ని చూసి జన సైనికులకు ఏదైనా చేయాలన్న తపనతో పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యవర్గంతో మాట్లాడి బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇందుకోసం ప్రీమియం కోసం రూ.కోటి నిధిని అందచేశాను.

ఈ కార్యక్రమాన్ని జన సైనికులు పెద్ద ఉద్యమంలా చేపట్టారు. లక్ష మందికిపైగా సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేశారు. ఇప్పటి వరకు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీమా చెక్కులు అందించారు. ఈ కార్యక్రమాన్ని మన కోసం తపన పడ్డ వ్యక్తులు, కుటుంబాలకు అండగా ఉండాలని చేపట్టింది. దీనిని ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీరమహిళలు ముందుండి నడింపించాలని, ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • active membership drive
  • Jana Sena
  • Pawan Kalyan

Related News

Janasena Pawan Kalyan

మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో భక్తుల సౌకర్యార్థం రూ. 10 కోట్లతో నిర్మించిన 22 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సిమెంట్ రోడ్డును ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ మార్గాన్ని కేవలం రోడ్డుకే పరిమితం చేయకుండా,

  • Ustaad Bhagat Singh

    ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్‌!

  • Deputy CM Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ఫోటో వివాదం..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Latest News

  • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

  • బంగ్లాదేశ్‌కు ప్ర‌ధాని మోదీ?!

  • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

  • Valentine’s Day : లవ్ అంటే అమ్మ తంతుంది..యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

Trending News

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

    • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd