PK Donation: కౌలు రైతుల కుటుంబాలకు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన ‘పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు గాను రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించారు.
- By Hashtag U Published Date - 10:46 PM, Tue - 5 April 22

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు గాను రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని ఈ కీలక ప్రకటన చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లుగా ఉగాది రోజున పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన మేరకే మంగళవారం నాడు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన జనసేనాని పవన్ కళ్యాణ్… కౌలు రైతుల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
మరోవైపు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన పవన్.. ఆర్థిక సాయంతో పాటు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించడనున్నట్లు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల పరామర్శ యాత్రలను ఈ నెల 12న అనంతపురం నుంచి ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.