Parliament: నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు
- Author : hashtagu
Date : 22-12-2021 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
శీతకాల పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23 వరకు నిర్వహించాల్సిన ఈ సమావేశాలను ప్రభుత్వ అజెండా పూర్తి కావడంతో బుధవారం పార్లమెంటు ఉభయ సభలను నివరవధిక వాయిదా వేయనున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభం అయిన ఈ సమావేశాలను షెడ్యూల్ కు ఒక రోజు ముందుగానే ముగించనున్నారు.
ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లు లను తీసుకువచ్చింది. మూడు సాగు చట్టాలను రద్దు చేయడం నుంచి అమ్మాయిల కనీస వివాహా వయస్సు కు సంబంధించిన బిల్లు వరకు అనేక బిల్లును పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానీ అమ్మాయిల వివాహా వయస్సు కు సంబంధిన బిల్లు మాత్రం ఆమోదించ లేదు. ఈ బిల్లును సెలక్టె కమిటీ కి కేంద్ర ప్రభుత్వం పంపించింది.