HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Panner Selvam Gave Cleanchit To Sasikala Before Armugaswamy Commission

Sasikala: శశికళకు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక పన్నీరు సెల్వం స్కెచ్‌ ఏమిటి?

  • Author : HashtagU Desk Date : 23-03-2022 - 10:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
6778
6778

తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా? ఎందుకంటే స్టాలిన్ కు ప్రజాదరణ పెరుగుతుండడంతో అన్నాడీఎంకే డిఫెన్స్ లో పడింది. అందులోనూ జయలలిత మృతి తరువాత ఆమె లేనిలోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. దానికితోడు ఇప్పుడు జయ మృతి కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. దాని ముందు వివరణ ఇస్తున్న ఒక్కొక్కరూ ఒక్కో నిజాన్నిచెబుతున్నారు. పన్నీర్ సెల్వం మాత్రం.. ఈ విషయంలో శశికళకు క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అన్నాడీఎంకేలోకి రావడానికి శశికళ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీలో కొన్ని వర్గాలు దీనికి సుముఖంగా లేవు. ఎందుకంటే ఒకసారి ఆమె పార్టీలోకి ప్రవేశిస్తే.. పార్టీ పగ్గాలు ఆమె చేతుల్లోకి వెళ్లిపోతాయని వారి ఆందోళన. అందుకే రాకుండా అడ్డుకుంటున్నారన్న వాదనుంది. దీంతో హస్తిన పెద్దల ద్వారా అన్నాడీఎంకేలోకి ఎంట్రీ కోసం శశికళ రాయబారం నడుపుతున్నారు. ఇంకా అక్కడి నుంచి చిన్నమ్మకు ఎలాంటి భరోసా రాలేదు.

ఇప్పుడు పన్నీర్ సెల్వం చిన్నమ్మకు పరోక్షంగా మద్దతు తెలిపినట్లయింది. నిజానికి శశికళకు వ్యతిరేకంగా తిరుబాటు జెండా ఎగురవేసిన తొలి వ్యక్తి పన్నీరు సెల్వమే. ఆమె జైలుకు వెళ్లిన తరువాత పళనిస్వామితో కలిసి అధికారాన్ని పంచుకున్నారు. కానీ చిన్నమ్మ జైలు నుంచి రావడం, తరువాత డీఎంకే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో తమిళనాడు రాజకీయాలు మారిపోయాయి. అందుకే ఇప్పుడు మళ్లీ చిన్నమ్మ పంచన ఆయన చేరాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయినా గతంలో ఆర్ముగస్వామి కమిషన్ 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు సెల్వం.. ఇప్పుడు ఎందుకు ఆదరాబాదరాగా కమిషన్ ముందు హాజరయ్యారు? జయలలితకు వ్యతిరేకంగా శశికళ కాని, ఆమె కుటుంబ సభ్యులు కాని ఎలాంటి కుట్రా చేయలేదని ఆయన చెప్పడంతో.. అసలేం జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. దీనిని బట్టి తమిళనాడు రాజకీయాలు.. అందులోనూ అన్నాడీఎంకే పాలిటిక్స్ ఎంత హాట్ గా మారాయో అర్థమవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIADMK
  • Panneerselvam
  • sasikala

Related News

Sengottaiyan Minister Carrying Jayalalithaa Photo

Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచిన టీవీకే అతిపెద్ద పార్టీగా గెలవడం, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో డ్రామా, చివరకు విజయ్ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. సీనియర్ నేత అయిన సెంగొట్టయాన్ విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన చొక్కా జేబులో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత నాయకురాలు జయలలి

  • A Big Twist in Tamil Nadu Politics Palaniswami's Mind Game

    Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పళనిస్వామి మైండ్ గేమ్

  • Tamil Nadu politics

    TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్

  • AIADMK says it will not support Vijay

    AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

  • DMK and AIADMK Hold Talks on Government Formation

    Tamil Nadu Politics: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..!

Latest News

  • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd