Holi Ban In PAK:పాకిస్థాన్ లో హోలీ నిషేధం
పాకిస్థాన్ లో హిందూ సంస్కృతిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ సంప్రదాయాన్ని అణచివేస్తూనే ఉన్నారు. తాజాగా పాక్ ప్రభుత్వం హోలీ పండుగను నిషేదించింది. దీంతో వివాదాస్పదంగా మారింది.
- By Praveen Aluthuru Published Date - 03:39 PM, Wed - 21 June 23

Holi Ban In PAK: పాకిస్థాన్ లో హిందూ సంస్కృతిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ సంప్రదాయాన్ని అణచివేస్తూనే ఉన్నారు. తాజాగా పాక్ ప్రభుత్వం హోలీ పండుగను నిషేదించింది. దీంతో వివాదాస్పదంగా మారింది.
పాకిస్థాన్‌లోని అన్ని విద్యాసంస్థల్లో హోలీని జరుపుకోవడం నిషేధించబడింది. పాకిస్తాన్ ఉన్నత విద్యా కమిషన్ ఈ ఉత్తర్వును జారీ చేసింది. దీంతో పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. హిందూ సాంప్రదాయంపై పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. విద్యాసంస్థల్లో హోలీ పండుగ నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి హిందూ సంఘాలు.
కాగా హోలీ పండుగపై ఆ దేశ కమిషన్ వివరణ కూడా వివాదాస్పదంగా మారింది. ఇలాంటి కార్యకలాపాలు దేశంలోని సామాజిక-సాంస్కృతిక విలువలకు పూర్తిగా భిన్నమైనవని. ఇది దేశ ఇస్లామిక్ గుర్తింపుకు విరుద్ధమని కమిషన్ పేర్కొంది. ఇటీవల క్వాయిడ్-ఎ-అజం యూనివర్సిటీలో హోలీ వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఉన్నత విద్యా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఖైద్-ఏ-అజామ్ యూనివర్సిటీలో హోలీ వేడుకల ఘటన ఆందోళనలు రేకెత్తించిందని, దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని కమిషన్ చెబుతోంది. విద్యార్థులు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని కమిషన్ సూచించింది.
Read More Water From Urine : అంతరిక్షంలో మూత్రాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చిన వ్యోమగాములు