Harish Rao: ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విపక్షాలు అల్లర్లు సృష్టిస్తున్నాయి: మంత్రి హరీశ్ రావు
విపక్షాలు అల్లర్లు సృష్టించి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు మంగళవారం ఆరోపించారు.
- By Balu J Published Date - 01:38 PM, Tue - 31 October 23

Harish Rao: విపక్షాలు అల్లర్లు సృష్టించి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు మంగళవారం ఆరోపించారు. దాడికి గురై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేతపై దాడిని విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు. సీనియర్ నేతలు సైతం చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
ప్రభాకర్ కు 15 సెంటీమీటర్లు కోసి చిన్నపేగులో కొంత భాగాన్ని తొలగించామని వైద్యులు చెబుతుంటే.. విపక్ష నేతలు చౌకబారు వ్యాఖ్యలు చేయడం వారి రాజకీయ దివాళాకోరుతనాన్ని తెలియజేస్తోందని హరీశ్ రావు అన్నారు. రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని ఆశిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. ఇలాంటి హత్యా రాజకీయాలను తెలంగాణ గతంలో చూడలేదన్నారు.
ఈ తరహా హత్యా రాజకీయాలు రాయలసీమ, బీహార్‌లో కనిపించాయి. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు జరగలేదన్నారు. కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయలను మింగేస్తూ హౌసింగ్ స్కామ్‌లకు పాల్పడ్డారని.. వారిని జైలుకు పంపేవాళ్లమని.. ఓటుకు నోటు కేసు ఉంది కానీ మేమేమీ చేయలేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని, న్యాయవ్యవస్థపై పార్టీకి విశ్వాసం ఉందని హరీశ్ రావు అన్నారు.