Chamoli Accident: అలకనంద నదిలో కూలిన వంతెన
దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రాణ నష్టం వాటిల్లుతుంది. చమోలిలో బుధవారం ప్రమాదం జరిగింది.
- Author : Praveen Aluthuru
Date : 02-08-2023 - 4:08 IST
Published By : Hashtagu Telugu Desk
Chamoli Accident: దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రాణ నష్టం వాటిల్లుతుంది. చమోలిలో బుధవారం ప్రమాదం జరిగింది. బద్రీనాథ్ ధామ్ వద్ద వంతెన నిర్మాణం జరుగుతుంది. అలకనంద ప్రవాహానికి వంతెన తెబ్బతిన్నది. దీంతో అందులో పనిచేస్తున్న ఓ కూలీ కొట్టుకుపోయాడు. ప్రస్తుతం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన కూలీ కోసం గాలిస్తున్నారు.
బద్రీనాథ్ మాస్టర్ ప్లాన్ కింద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, శ్రీ బద్రీనాథ్ ద్వారా బ్రహ్మ కపాల్ సమీపంలో తాత్కాలిక వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న వంతెన పాడై అలకనంద నదిలో పడిపోయింది. వంతెన కూలడంతో ఇద్దరు కూలీలు కొట్టుకుపోయారు. అందులో ఒకరు క్షేమంగా బయటపడగా, మరొక కూలీ ఆచూకీ లభ్యం కాలేదు. 28 ఏళ్ల సోను అనే కార్మికుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రఘువీర్ అనే మరో కార్మికుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. రఘువీర్ వయసు 30 సంవత్సరాలు.రఘువీర్‌ను ప్రథమ చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బద్రీనాథ్‌లో చేర్చారు. కాగా సోనూను ఎస్‌డిఆర్‌ఎఫ్ మరియు స్థానిక పోలీసులు వెతుకుతున్నారు.
Also Read: AP 2024 Elections : తెనాలి జనసేన అభ్యర్థి ని ప్రకటించిన పవన్ కళ్యాణ్..ఫస్ట్ గెలుపు ఇదేనట