Omicron: ఒమిక్రాన్ కేసులు 578కి పెరిగాయి!
- By Balu J Published Date - 11:56 AM, Mon - 27 December 21
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తాజాగా ఒమిక్రాన్ కేసులు 578కి పెరిగాయి. వీరిలో 151 మంది కోలుకున్నారు. మొత్తంగా 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఢిల్లీ తొలిస్థానానికి చేరింది. ఢిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య 141గా ఉంది. కాగా ఓమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతోంది.

Report