Ola Sports Car : త్వరలోనే రానున్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు.. ఫీచర్లు, ధర చూస్తే?
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పటికే పలు రకాల కార్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల
- By Anshu Published Date - 08:00 AM, Tue - 19 July 22

ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ బైక్స్‌ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా త్వరలోనే స్పోర్ట్స్ కారుని లాంచ్ చేయబోతోంది. ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ కార్ ను ప్రవేశ పెట్టేందుకు ఆ సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇదే విషయాన్ని ఓలా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు ధర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఓలా కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎస్ 1సిరీస్ గురించి కూడా వివరించారు.
We’re going to build the sportiest car ever built in India! 🏎🏎🏎 pic.twitter.com/IyMKgQvTOi
— Bhavish Aggarwal (@bhash) July 16, 2022
ఈ సందర్భంగా అతను ట్వీట్ చేస్తూ.. మొదటిసారిగా మేకింన్ ఇండియా స్పోర్ట్స్ కారును తయారు చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా త్వరలోనే రానున్న మూవ్ ఓస్ 3 గురించి కూడా అప్డేట్ ఇచ్చారు భవిష్ అగర్వాల్. ఈ ఏడాది దీపావళి నాటికి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ కూడా లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. మూవ్ ఓస్ 3 టెస్ట్ డ్రైవ్ కి అందుబాటులోకి వచ్చే వరకు నిరీక్షించక తప్పదు అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఓలా వివిధ భాగాల్లో పనిచేస్తున్న 500 మంది సిబ్బందిని తొలగించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
MoveOS 3 launch for everyone on Diwali this year. If MoveOS 2 was exciting, wait till you experience MoveOS 3😍
Hill hold, proximity unlock, moods, regen v2, hypercharging, calling, key sharing, many new features!
Proud of Ola Engineering for executing worldclass tech at speed!
— Bhavish Aggarwal (@bhash) July 16, 2022