Amaravati Mahapadyatra: అమరావతి మహాపాదయాత్రకు అడ్డంకులు
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈ రోజు 14వ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో ప్రారంభమైంది. అయితే, పాదయాత్రకు అక్కడక్కడ అడ్డంకులు ఎదురవుతున్నాయి.
- By Hashtag U Published Date - 12:13 PM, Sun - 25 September 22

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈ రోజు 14వ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో ప్రారంభమైంది. అయితే, పాదయాత్రకు అక్కడక్కడ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ రోజు పాదయాత్ర మార్గంలో రహదారిపై అడ్డంగా ఇసుక లారీని నిలిపారు. మరమ్మతుల కోసం ప్రధాన రహదారిపై ఇసుక లారీని నిలిపినట్లు చెబుతున్నారు. పాదయాత్ర కొనసాగే నందివాడ మండల ప్రధాన రహదారిపై ఈ లారీని ఆపారు. లారీ నందివాడ ఎంపీపీ పెయ్యల అదామ్‍కు చెందినదిగా గుర్తించారు. ఇసుక లారీ తొలగించకపోతే పాదయాత్ర ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్ లేకపోవడంతో పోలీసులు జేసీబీతో లారీని తొలగించారు.
కాగా, పాదయాత్ర మధ్యాహ్నానికి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. పాదయాత్రలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రావి వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, అఖిలపక్ష ఐక్యకార్యాచరణ సంఘం నేతలు, రైతులు పాల్గొన్నారు.