NTR Daughter : ఉమామహేశ్వరికి కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో పాల్గొన్న లోకేష్, చంద్రబాబు
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి.
- By Vara Prasad Published Date - 02:15 PM, Wed - 3 August 22

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది.ఉమ భర్త శ్రీనివాస్ ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు బంధువులు, మిత్రులు నివాళులర్పించిన అనంతరం వారి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపారు. అంతిమయాత్రలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరి పెద్ద కూతురు విశాల బుధవారం తెల్లవారుజామున అమెరికా నుంచి వచ్చింది. తన తల్లిని విగతజీవిగా చూసి ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.
Related News

Fake Tweets: కేశినేని పేరుతో ట్వీట్ల కలకలం…తనవి కావన్న కేశినేని నాని..!!
సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్లు కలకలం రేపాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆ ట్వీట్లు ఉండటంతో అందరి చూపు అటువైపు మళ్లింది.