Underwater Nuclear Drone : సముద్ర గర్భ అణ్వాయుధ డ్రోన్ పరీక్ష.. కిమ్ దూకుడు
Underwater Nuclear Drone : దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలకు ఉత్తర కొరియా మరోసారి ఛాలెంజ్ విసిరింది.
- By Pasha Published Date - 12:08 PM, Fri - 19 January 24

Underwater Nuclear Drone : దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలకు ఉత్తర కొరియా మరోసారి ఛాలెంజ్ విసిరింది. యుద్ధానికి సిద్ధం అనేలా మరో సంకేతాన్ని పంపింది. తాజాగా ఉత్తర కొరియా దేశం అణుసామర్థ్యం కలిగిన సముద్రగర్భ డ్రోన్‌ను టెస్ట్ చేసింది. అమెరికా, జపాన్ సైన్యాల జాయింట్ మిలిటరీ డ్రిల్‌కు ప్రతిస్పందనగా ఈ పరీక్షలను చేసింది.ఈవిషయాన్ని ఉత్తర కొరియా మిలిటరీ శుక్రవారం ప్రకటించింది. ‘‘అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్‌వాటర్ డ్రోన్‌ను టెస్ట్ చేశాం. ఇది సముద్ర గర్భంలో తిరుగుతూ శత్రువుల కదలికలను పసిగట్టి ఎటాక్ చేస్తుంది. అమెరికా, దాని మిత్రదేశాలను నిలువరించడానికి మా ప్రతిచర్యలు ఇలాగే కొనసాగుతాయి’’ అని ఉత్తర కొరియా సైన్యం స్పష్టం చేసింది. తమ దేశంలో సూదిమొనంత స్థలాన్ని ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
- అణ్వాయుధ సామర్థ్యం కలిగిన డ్రోన్‌ను(Underwater Nuclear Drone) ఉత్తర కొరియా గతేడాది పరీక్షించింది.
- ‘హెయిల్’ పేరుతో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన డ్రోన్‌ను గతేడాది మార్చి నుంచి పరీక్షిస్తోంది.
- ప్రత్యర్థుల నౌకలు, ఓడరేవులే లక్ష్యంగా రూపొందించిన ఈ డ్రోన్‌లను తీరం నుంచి కూడా ప్రయోగించే వీలు ఉంది.
- ఉత్తరకొరియా న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణుల కంటే ఇవి తక్కువ సామర్థ్యం కలిగినవే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Pannun Warning : సీఎం యోగిని చంపేస్తాం.. 22న అయోధ్యలో ఎటాక్ తప్పదు : పన్నూ
కిమ్ జోంగ్ ఉన్ వారసురాలు ఆమేనట..
ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ వారసత్వాన్ని కొనసాగించేదెవరో గుర్తించామని దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ తెలిపింది. ఆయనతోపాటు మిలటరీ పరేడ్, మిసైల్ లాంఛ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్న కుమార్తె ఆయన వారసురాలయ్యే అవకాశాలు ఉన్నాయని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ తెలిపింది. కిమ్ తరువాత ఆయన చిన్న కుమార్తె కిమ్ జు యే వారసురాలు కానుందని దక్షిణ కొరియా జాతీయ ఇంటెలిజెన్స్ సర్వీస్ ధ్రువీకరించింది. అయితే, ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉందని, దాదాపుగా ఆమె పేరే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. 2022లో మొదటిసారిగా కిమ్ జు యే పేరు బయటకు వచ్చింది. ఆమె ప్రజల ముందుకు వచ్చింది. “ఆమె తొలిసారి ప్రజల మధ్యకు వచ్చినప్పటి నుంచి, ప్రజా కార్యక్రమాలు, కార్యకలాపాల సమగ్ర విశ్లేషణ ఆధారంగా, కిమ్ జు యే వారసురాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని ఎన్ఐఎస్ పేర్కొంది. “ఇతర సాధ్యాసాధ్యాల గురించి కూడా విశ్లేషణలు జరుపుతున్నాం. ఎందుకంటే కిమ్ జోంగ్ ఉన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆయన వయసు కూడా తక్కువే. ఇంకేమైనా జరగొచ్చు” అని తెలిపింది.