Non Stop Direct Flights: ఇకపై ముంబై నుండి ఆ 11 నగరాలకు వరుస విమానాలు?
ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎక్కువ శాతం మంది ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. కొంచెం దూర ప్రయాణం అంతే విమానం అన్నది
- By Anshu Published Date - 07:30 PM, Thu - 1 June 23

ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎక్కువ శాతం మంది ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. కొంచెం దూర ప్రయాణం అంతే విమానం అన్నది తప్పనిసరి. విమానంలో టికెట్లు ఉంటే పెద్ద టెన్షన్ అని చెప్పవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే ఎయిర్ ఇండియా ఈ సెలవుల సీజన్ లో ప్రయాణికులకు కొత్త ఆ కానుకను అందించింది. ఎయిర్ ఇండియా ఒకటి రెండు కాదండోయ్ ఏకంగా 11 నగరాలకు నాన్ స్టాప్ డైరెక్ట్ విమానాలను ప్రకటించింది. ఇందులో చాలా నగరాలకు రోజు రెండు నుంచి మూడు నాలుగు విమానాలు కూడా ఉన్నాయి.
ఒకవేళ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే అందుకోసం WWW.airindia.com లింకు నుంచి మీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ ఇండియా చేసిన ట్వీట్ ప్రకారం.. ముంబై నుండి అహ్మదాబాద్ కు ప్రతిరోజు రెండు కొత్త నాన్ స్టాప్ డైరెక్ట్ విమానాలు నడుస్తున్నాయి. అలాగే ముంబై నుండి జైపూర్ కు రోజు రెండు నాన్ స్టాప్ విమానాలు నడుస్తున్నాయి. ముంబై నుండి నాగపూర్ కు ప్రతిరోజు మూడు నాన్ స్టాప్ విమానాలు ఉన్నాయి. ఈ వేసవి సెలవుల్లో గోవా వెళ్లాలి అనుకుంటున్నా వారికి ఎక్కువ సంఖ్యలో విమానాలు ఉన్నాయి. ముంబై నుంచి గోవాకి ప్రతిరోజు నాలుగు నాన్ స్టాప్ విమానాలు ఉన్నాయి.
అలాగే ముంబై నుండి కొచ్చికి ప్రతిరోజు నాలుగు నాన్ స్టాప్ విమానాలు ప్రారంభమవుతాయి. అలాగే అమృత సర్ కీ కూడా నాన్ స్టాప్ ఫ్లైట్ ఉంటుంది. ఎయిర్ ఇండియాకు చెందిన నాన్ స్టాప్ డైరెక్టర్ విమానాలు ముంబై నుంచి మంగలూరుకీ నడుస్తాయి. ముంబై నుంచి గుజరాత్ లోని రాజ్కోట్ కు రెండు నాన్ స్టాప్ విమానాలు నడుస్తాయి. అలాగే కోయంబత్తూర్ లోని దక్షిణ నగరం నుండి గుజరాత్ లోని వడోదరకు ప్రతిరోజు రెండు డైరెక్ట్ విమానాలు ఉన్నాయి.