Yoga Day : యోగా డే సందర్భంగా తాజ్ మహాల్ చూసేవారికి బంపర్ ఆఫర్..!
- Author : Prasad
Date : 21-06-2022 - 8:26 IST
Published By : Hashtagu Telugu Desk
నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్, ఆగ్రా కోట, ఇతర స్మారక చిహ్నాల వద్ద భారత పురావస్తు శాఖ (ASI) ఎటువంటి ప్రవేశ రుసుమును వసూలు చేయదని అధికారులు తెలిపారు. ASI (ఆగ్రా సర్కిల్) సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా సర్కిల్, అంతటా ఉన్న ఇతర ASI-రక్షిత స్మారక కట్టడాలలో పర్యాటకులకు ఉచిత ప్రవేశ టిక్కెట్లు ఉంటాయని తెలిపాఉ. భారతీయులు, విదేశీయులందరికీ రోజంతా ఉచితంగా ప్రవేశం ఉంటుందని వెల్లడించారు. ఇదిలావుండగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీలోని ‘పంచ్ మహల్’లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్ని వర్గాల ప్రజలతో పెద్ద సంఖ్యలో యోగా చేస్తారని జిల్లా అధికారులు తెలిపారు.