No Fish Medicine: ఈ ఏడాది చేప మందు ప్రసాదం లేదు…హైదరాబాద్ కు రావొద్దు..!!
మృగశిర కార్తె వచ్చిందంటే చాలు..హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో సందడిగా ఉంటుంది. బత్తిని వంశస్తులు ఆస్తమా రోగులకు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తుంటారు.
- By Hashtag U Published Date - 03:39 PM, Wed - 25 May 22

మృగశిర కార్తె వచ్చిందంటే చాలు..హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో సందడిగా ఉంటుంది. బత్తిని వంశస్తులు ఆస్తమా రోగులకు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు..దేశాల నుంచి ప్రజలు చేపప్రసాదం కోసం ఇక్కడికి వస్తుంటారు. ప్రభుత్వం అనుమతితో చేప ప్రసాదం పంపిణీ ప్రతిఏడాది జరుగుతుంది. అయితే గత మూడు సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది.
కోవిడ్ కారణంగా చేపప్రసాదం పంపిణీకి సర్కార్ అనుమతి ఇవ్వడం లేదు. చేపప్రసాదం కోసం భారీ సంఖ్యలో ఆస్తామా రోగులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి పెరుగుతుందని…మూడేండ్లుగా చేప ప్రసాదం పంపిణీని ప్రభుత్వం నిరాకరిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో ఆస్తమా రోగులకు ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా చేపప్రసాదం చేస్తారని అంతా అనుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని నిర్వాహకుడు బత్తిని గౌరీ శంకర్ తెలిపారు.
ప్రతిఏటా మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వం అనుమతితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పలు ప్రాంతాల ఆస్తమా రోగులకు ఉచితంగా చేపప్రసాదాన్నిఅందించాం. కానీ ఈ ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండటంతో చేప ప్రసాదం పంపిణీకి అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసిందనన్నారు. ఆస్తమా రోగులు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.