Nivetha Pethuraj: రెస్టారెంట్ రంగంలోకి నివేత పెతురాజ్!
- By Balu J Published Date - 10:44 AM, Thu - 23 March 23

నివేత పెతురాజ్ త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తానంటోంది. మరోవైపు సినిమాలు కూడా నిర్మిస్తానని చెబుతోంది. నటనతో పాటు బిజినెస్ పై దృష్టి పెట్టాను. చెన్నైలో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. అది క్లిక్ అయితే మరిన్ని రెస్టారెంట్లు మొదలుపెట్టే ఆలోచన ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే, దర్శకత్వం చేయాలని లేదు. కుదిరితే సినిమాలు నిర్మించి, మూవీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుంది.” ఇలా తన బిజినెస్ ఆలోచనలు బయటపెట్టింది నివేత పెతురాజ్. ఇలా వ్యాపారం చేయాలనే ఆలోచనతో పాటు, కెరీర్ ను విస్తరించుకునే పనిలో కూడా పడింది ఈ బ్యూటీ. త్వరలోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతోంది.