Nikhat Zareen: ఉమెన్స్ నేషనల్ టైటిల్ ఛాంపియన్ గా నిఖత్ జరీన్!
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మరో టైటిల్ ను గెలుచుకుంది.
- Author : Balu J
Date : 26-12-2022 - 2:19 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ బాక్సర్ (Boxer) నిఖత్ జరీన్ బాక్సింగ్ గేమ్ లో దూసుకుపోతోంది. తాజాగా మరో టైటిల్ గెలుచుకొని ఆడపిల్లలు ఎదైనా సాధింగలరు అని నిరూపించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) తాజాగా మధ్యప్రదేశ్ బోపాల్ లో జరిగిన 6వ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. సోమవారం జరిగిన తుదిపోరులో రైల్వేస్ (RSPB) బాక్సర్ అనామికతో తలపడి ఏకపక్ష విజయం నమోదు చేసింది.
50 కేజీల మహిళల ఫైనల్లో నిఖత్ (Nikhat Zareen) 4-1 తో రైల్వేస్ బాక్సర్ అనామికపై గెలుపొందింది. పోరు ఆరంభం నుంచే వరుస పంచ్‌లతో విరుచుకుపడిన నిఖత్‌కు, అనామిక కనీస పోటీనివ్వలేకపోయింది. నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు,తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని చిరస్థాయిలో నిలిచిపోయేలా తన ప్రతిభను కనబరుస్తున్న నిఖత్ జరీన్ (Nikhat Zareen)కు తెలంగాణ ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని ఆకాంక్షించారు.
Also Read: TDP Strategy: తెలంగాణ టీడీపీ దూకుడు.. ‘సెంటిమెంట్’ అస్త్రంగా సింహగర్జనలు!