Niger Coup : నైగర్ అధికార పార్టీ ఆఫీసుకు నిప్పు.. సైనిక తిరుగుబాటుతో ఉద్రిక్తత
Niger Coup : నైగర్‌లో సైనిక తిరుగుబాటు ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ తిరుగుబాటుతో పదవిని కోల్పోయిన దేశ అధ్యక్షుడు 64 ఏళ్ల మొహమ్మద్ బజౌమ్ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది.
- By Pasha Published Date - 07:10 AM, Fri - 28 July 23

Niger Coup : నైగర్‌లో సైనిక తిరుగుబాటు ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ తిరుగుబాటుతో పదవిని కోల్పోయిన దేశ అధ్యక్షుడు 64 ఏళ్ల మొహమ్మద్ బజౌమ్ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. తిరుగుబాటును సపోర్ట్ చేసే ఆందోళనకారులు పార్టీ కార్యాలయంపై దాడి తెగబడ్డారు. దానికి నిప్పంటించారు. ఆఫీసు బయట ఉన్న కార్లపైకి రాళ్లు రువ్వి, తగులబెట్టారు. ఈక్రమంలో ఆందోళనకారులు రష్యా జెండాలను ప్రదర్శించడం గమనార్హం. అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను బుధవారం బందీగా తీసుకున్న తిరుగుబాటు సైనికులకు ఇప్పుడు సైన్యం పూర్తి మద్దతు ప్రకటించింది.
Also read : Vastu Tips: ఈ వెండి వస్తువులు మీ వెంట ఉంటే చాలు.. అదృష్టం, ఐశ్వర్యం మీ వెంటే?
అయితే అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ ను(Niger Coup) విడుదల చేయాలని అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చాయి. బజౌమ్ ను వెంటనే, బేషరతుగా విడుదల చేయాలని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిమాండ్ చేశారు. నైగర్‌లో తమ మానవతా కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఐక్యరాజ్యసమితి (UN) తెలిపింది. నైగర్‌లో నాలుగు మిలియన్లకు పైగా ప్రజలకు మానవతా సహాయం అవసరమని UN గతంలో పేర్కొంది.రెండేళ్ల క్రితం నైగర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 64 ఏళ్ల మొహమ్మద్ బజౌమ్ .. ఇస్లామిస్ట్ మిలిటెంట్లపై పోరాటంలో పాశ్చాత్య దేశాలకు పూర్తి సహాయ సహకారాలు అందించారు.
Also read : Peacock Feather: మీ ఇంట్లో నెమలి పించం ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?