News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Natural Star Nani Launches The Teaser Of Muthayya

Muthayya: నాని చేతుల మీదుగా “ముత్తయ్య” టీజర్ రిలీజ్!

జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య.

  • By Balu J Updated On - 12:33 PM, Sun - 1 May 22
Muthayya: నాని చేతుల మీదుగా “ముత్తయ్య” టీజర్ రిలీజ్!

జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య. అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది “ముత్తయ్య” సినిమా టీజర్. ఈ టీజర్ ను నేచురల్ స్టార్ నాని శనివారం విడుదల చేశారు. 24 ఏళ్ల వయసులో నాకు “అష్టా చమ్మా” సినిమాలో అవకాశం రాకుంటే 70 ఏళ్లకు నేనూ ముత్తయ్యలాగే అయ్యేవాడిని. టీజర్ మనసుకు హత్తుకుంది అంటూ స్పందించారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ అంటూ విశెస్ చెప్పారు. కె సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్
టైన్ మెంట్ సంస్థలు బ్యానర్స్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పణలో వ్రిందా ప్రసాద్ నిర్మించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం. మే 9న లండన్ లోని రిచ్ మిక్స్ లో ప్రీమియర్ కానుంది.

టీజర్ విడుదల సందర్భంగా చిత్ర సమర్పకులు కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి మాట్లాడుతూ.. మా సినిమా టీజర్ ను నాని విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా సంస్థ తరపున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. ముత్తయ్య ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచే సినిమా అవుతుంది. అన్నారు. నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు నానికి థాంక్స్. జీవితంలో ఏదైనా సాధించాలని కలగనే ప్రతి ఒక్కరూ ముత్తయ్యలో కనిపిస్తారు. అలాంటి వారి భావోద్వేగాలను  దర్శకుడు భాస్కర్ మౌర్య ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. మా సినిమా యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైనందుకు గర్వంగా ఉంది. ప్రెజెంటర్స్ హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు  కృతజ్ఞతలు. అన్నారు. దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ.. తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించే ఎంతోమంది వ్యక్తుల ఆరాటానికి ప్రతిబింబం ఈ సినిమా. అలాంటి వాళ్ల నుంచి స్ఫూర్తి పొందే ఈ కథ రాసుకున్నాను. నా కథను అందంగా తెరకెక్కించేందుకు సహకరించిన టీమ్ అందరికీ థాంక్స్. అన్నారు.

 

Tags  

  • hero nani
  • latest tollywood news
  • muthayya
  • teaser out

Related News

Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల  ఖుషి!

Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల ఖుషి!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు.

  • Naga Chaitanya: ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌!

    Naga Chaitanya: ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌!

  • Sunil Exclusive: నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ!

    Sunil Exclusive: నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ!

  • Anasuya: ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

    Anasuya: ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

  • Sonal Chauhan Interview: ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్!

    Sonal Chauhan Interview: ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్!

Latest News

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

  • TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్

  • AP Teachers : స‌మ్మె దిశ‌గా ఏపీ టీచ‌ర్లు

  • SA vs Ind: భారత్‌తో సీరీస్ కు సఫారీ టీమ్ ఇదే

  • Virus In SmartPhone: మీ స్మార్ట్ ఫోన్‌కు వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి…లేకపోతే హ్యాకర్ల చేతిలో మీ పని గోవిందా…?

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: