HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nara Lokesh Tweet On Ap Debt

YCP : ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం.. లెక్కలతో బయటపెట్టిన లోకేష్

YCP : జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకున్న అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీ లెక్కలను బయటపెట్టారు

  • Author : Sudheer Date : 17-02-2025 - 1:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan Tweet
YS Jagan Tweet

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైందని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ లేకుండా వృధా ఖర్చులు చేస్తూ, భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకున్న అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీ లెక్కలను బయటపెట్టారు. గత ముఖ్యమంత్రుల కాలంలో 2019 నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు కట్టాల్సిన వడ్డీ రూ.14,155 కోట్లు కాగా, జగన్ ఐదేళ్ల పాలనలో అది రూ.24,944 కోట్లకు పెరిగిందని ఆరోపించారు. అంటే కేవలం ఐదేళ్లలోనే రూ.11 వేల కోట్ల అదనపు వడ్డీ భారం ప్రజలపై పడిందని తెలిపారు.

జగన్ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని, ఆర్థిక ఉద్ధృతి కోసం చేసిన అప్పులు ప్రజలకు లాభంగా కాకుండా మరింత భారం అయ్యాయని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ఏపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని ఆరోపించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ అప్పుల భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని లోకేష్ హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత ప్రభుత్వ హయాంలో అప్పులపై స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు.

రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అందినకాడికి అప్పులు చేశారు. 58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా… జగన్ రెడ్డి పాలించిన… pic.twitter.com/8y2vvPxtkR

— Lokesh Nara (@naralokesh) February 17, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP debt
  • jagan
  • lokesh tweet
  • nara lokesh
  • YCP Govt

Related News

Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర

  • AP Education Minister Nara Lokesh

    TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

  • Jagan Lotus Pond

    YCP Jagan : మళ్లీ లోటస్‌పాండ్ కు జగన్ మకాం ?

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd