HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nani Presents Meet Cute Streaming From 25th November

Meet Cute: నవంబర్ 25 నుండి “మీట్ క్యూట్” స్ట్రీమింగ్

టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేసిన ''మీట్ క్యూట్' టీమ్ ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేసింది. టీజర్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి

  • Author : Balu J Date : 19-11-2022 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Meet Cute
Meet Cute

టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేసిన ”మీట్ క్యూట్’ టీమ్ ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేసింది. టీజర్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి రోలర్ కోస్టర్ ఎమోషన్ ని చూపించగా, ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంది. ‘నీకు మీట్‌ క్యూట్‌ అంటే తెలుసా.. అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు.. మాటలు.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’’ అంటూ నాని వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ మనసును హత్తుకునేలా ఉంది.

కొన్ని అర్బన్ ప్రేమ కథలను.. విభిన్న ప్రేమికుల మధ్య విభిన్న భావోద్వేగాలను ఈ ట్రైలర్ లో ఆవిష్కరించారు. మనం ప్రేమించే వారితో, మనం ఇష్టపడే వాటి కోసం మాత్రమే గొడవపడతాం’ అనే సందేశాన్ని ఈ ఎంథాలజీ హృద్యంగా అందిస్తోంది. ఇందులో ప్రతి కథకు ప్రాముఖ్యత ఉంది. ఈ తరం యువతకు రిలవెంట్ గా వుంది. సిరీస్ లోని పెద్దలు రెండు తరాల మధ్య వారధిగా కనిపిస్తున్నారు. అన్ని రకాల భావోద్వేగాల సమ్మేళనంగా మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ సీరీస్ ప్రజంట్ చేయడంలో దర్శకురాలు దీప్తి గంటా ఆకట్టుకున్నారు. ట్రైలర్ లో చూపించిన భావోద్వేగాలు మనసుని హత్తుకునేలా వున్నాయి.

ట్రైలర్ అద్భుతమైన విజువల్స్ తో పాటు సిరీస్ కు తగినట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. దీనికి వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. టెక్నికల్ టీం అంతా అద్భుతమైన టీం వర్క్ తో గ్రేట్ అవుట్ పుట్ ఇచ్చింది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని ‘మీట్ క్యూట్’ నిర్మిస్తున్నారు. సత్యరాజ్ , రోహిణి మొల్లేటి , అదా శర్మ , వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ ,సునయన, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ మంచి అంచనాలను నెలకొల్పగా, ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. నవంబర్ 25 నుండి సోనీ లివ్‌లో ఎంథాలజీ స్ట్రీమింగ్ కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor nani
  • streaming
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd